అమరేశ్వర దేవాలయం కారణంగా అమరావతి ప్రసిద్ది చెందింది. దీనిని క్రీస్తు పూర్వం 2వ శతాబ్దానికి
ముందు భగవంతుడు శివునికి అంకితం చేయడమైయింది. అంతేగాక శాతవాహనులు మరియు పల్లవ రాజాలకు
కూడా ఒకసారి రాజధానిగా ఉంది. శాతవాహనులు రాకపూర్వం అమరావతి బౌద్ధ ధర్మానికి కేంద్రంగా
ఉంది, మరియు మౌర్య సామ్రాజ్యం ఆధ్వర్యంలో అశోక చక్రవర్తి ( క్రీస్తు పూర్వం 269 -232
) పరిపాలించిన కాలంలో స్థూపం మరియు మఠాన్ని నిర్మించడమయింది.
ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అయిన అమరావతి - ఉజ్వలవంతమైన, విభిన్నమైన, సమ్మిళిత, ఆధునికథతో
ఆఖండ భూమికి గుర్తుగా ప్రజా రాజధానిగా ఉంటుంది. ప్రపంచ శ్రేణి ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని
ప్రభావవంతమైన ఏకీకృత అభివృద్ధి కోసం దోహదపడే విధంగా ప్రణాళికాబద్ద పట్టణ మౌలిక సదుపాయాలను
కలిగివుండి నిర్వహణపరంగా ఆకర్షణీయంగాను సాంకేతిక పరిజ్ఞానం ఆధారితంగాను మరియు పర్యావరణపరంగా
సుస్థిర పర్యావరణ వ్యవస్థగాను ఉంటుంది. ఆధునిక హరిత రాజధాని పెట్టుబడుదారులు, వ్యాపారాలు,
విద్య మరియు పర్యాటకం కోసం అత్త్యుత్తమ గమ్యస్థానంగా ఉంటుంది.
ఈ దార్శినికతను సాకారంచేయడానికి 'విశిష్ట భూ సమీకరణ పథకం' క్రింద తమ భూములను స్వచందంగా
ఇచ్చారు. 'భూమి పుత్రులు ' అయిన రైతులు, పౌరులు 'నా ఇటుక -నా అమరావతి ' లో భాగంగా ఇటుకలను
విరాళంగా ఇచ్చారు. తద్వారా, పునాది పడుతూ, పురోగతికి సుగమయింది. అందువల్ల ప్రగతి, సంక్షేమం
మరియు ఆనందాన్ని పెంపొందిస్తూ భారతదేశ పట్టణీకరణ చరిత్రలో ఒక ముఖ్యమైన మైలురాయిగా ఉండేలా
అమరావతిని ఊహించడమయింది.
ఆంధ్రప్రదేశ్ ను భారతదేశంలోని అత్యంత ఆశాజనకమైన మరియు సుసంపన్నమైన రాష్ట్రాలలో ఒకటిగా
రూపంతరీకరించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నూతన రాజధాని అమరావతి నిర్మాణం అనే సదరు
లక్ష్యాన్ని, సాధించే దిశగా తన అతిపెద్ద ప్రణాళికను ప్రారంభించింది.